Parts of national capital received showers on December 12 evening.
Rain has also raised hopes for better air quality. The rains are also expected to add to the winter chill
#Delhi
#nationalcapital
#airquality
#Delhirain
#DelhiAirpollution
#temperature
దేశ రాజధానిలో గురువారం రాత్రి వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్మలంగా కనిపించిన ఆకాశం కాస్తా రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా మేఘావృతమైంది. కుండపోతగా వర్షం కురిసింది. పార్లమెంట్ భవనం సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. క్షీణించిన ఉష్ణోగ్రత.. ఒక్కసారిగా చోటు చేసుకున్న వాతావరణ మార్పుల ఫలితంగా- ఢిల్లీలో ఉష్ణోగ్రత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గురువారం రాత్రి 10 గంటల సమయానికి 12.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది